‘కేదార్ జాదవ్‌ను ఇంటికి పంపండి’

by Anukaran |
‘కేదార్ జాదవ్‌ను ఇంటికి పంపండి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌2020లో గురువారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌లో చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన బ్యాట్‌మెన్ కేదార్ జాదవ్‌ను టీమ్ నుంచి తప్పించాలని క్రీడాభిమానులు సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అంతేగాకుండా కేదార్ ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదని, కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమికి జాదవే కారణం అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను దుబాయ్ నుంచి ఇండియాలోని ఆయన ఇంటికి పంపించాలని అంటున్నారు.

Advertisement

Next Story