- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్మిత్‌పై వార్న్ వ్యాఖ్యలు.. అభిమానుల ఫైర్

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌పై అదే దేశానికి చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం వార్న్ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘జట్టు సెలెక్షన్ అసలు బాగాలేదు. తుది జట్టులోకి మార్ష్‌ను ఎందుకు తీసుకోలేదో అర్దం కావడం లేదు. మ్యాక్స్‌వెల్ పవర్ ప్లేలోనే బ్యాటింగ్‌కు వెళ్లాలి. కానీ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా వ్యూహాలు అన్నీ చెత్తగా ఉన్నాయి. అసలు టీ20 జట్టులో స్టీవ్ స్మిత్ ఎందుకు ఉండాలి’ అని ట్వీట్ చేశాడు. ఒకవైపు తనకు స్మిత్ అంటే చాలా ఇష్టం అని చెబుతూనే అతడిపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ ట్వీట్‌పై ఆస్ట్రేలియా అభిమానులు వార్న్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మిత్ ఒక మంచి బ్యాటర్ అని.. ఏ ఫార్మాట్‌లో అయినా చక్కగా రాణిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే ఇలాంటి ట్వీట్ చేస్తావా అంటూ వార్న్‌పై విరుచుకపడుతున్నారు. ఇకపై జట్టు గురించి ఇలాంటి ట్వీట్లు చేయవద్దని వార్న్‌కు సూచిస్తున్నారు.
- Tags
- cricket