- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మిస్ యు సుశాంత్’.. అభిమానుల నివాళులు
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది పూర్తయింది. గత సంవత్సరం ఇదే రోజున సుశాంత్ చనిపోయాడన్న వార్తతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో తన మరణానికి పలువురు కారణమంటూ బాలీవుడ్ యాక్టర్స్‌పై ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దాంతో సీబీఐ సుశాంత్ డెత్ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. ఆయన డెత్ యానివర్సరీ సందర్భంగా అభిమానులు నివాళులు అర్పించారు. ముంబైలోని తన నివాసం ఎదుట ఫొటోలకు పూలదండలు వేసి క్యాండిల్స్ వెలిగించి సుశాంత్ లెగసీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న అభిమానులు.. ఫెయిర్ జస్టిస్ కోసం డిమాండ్ చేశారు.
సుశాంత్ డెత్ యానివర్సరీ సందర్భంగా కోస్టార్స్ స్మరించుకున్నారు. ‘సోంచరియా’ సినిమాలో సుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న భూమి పెడ్నేకర్… ‘ మిస్ యూ.. నువ్వు అడిగే ప్రశ్నలు, మాట్లాడే ప్రతీ విషయం మిస్ అవుతున్నా. నేను ఇంతకు ముందెన్నడూ చూడలేని విధంగా ప్రపంచాన్ని చూపించావు. నీకు శాంతి దొరికిందని ఆశిస్తున్నా’ అని పోస్ట్ పెట్టింది.
https://www.instagram.com/p/CQFgfKXhnoi/?utm_source=ig_web_copy_link