నిధి అగర్వాల్‌కు గుడికట్టిన అభిమానులు.. ఫొటోలు వైరల్

by Jakkula Samataha |
నిధి అగర్వాల్‌కు గుడికట్టిన అభిమానులు.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : ‘నేషనల్ క్రష్ నిధి అగర్వాల్’ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా అభిమానులు చెన్నైలో ఆమెకు గుడికట్టి తమ ప్రేమను వ్యక్తపరిచారు. అంతేకాదు పాలాభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. నిధి కెరీర్ విషయానికొస్తే.. ‘భూమి’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన భామ, ఆ తర్వాత ‘ఈశ్వరన్‌’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తున్న ఈ భామకు ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే కోలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాగా #National Crush హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ ఫొటోలను చూసి ఇస్మార్ట్ భామ నిధి ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది.



Next Story

Most Viewed