తండ్రి పేరిట స్కూల్ కట్టిస్తున్న ప్రముఖ డైరెక్టర్

by Anukaran |   ( Updated:2020-08-03 03:11:35.0  )
తండ్రి పేరిట స్కూల్ కట్టిస్తున్న ప్రముఖ డైరెక్టర్
X

మ్యాథ్స్ టీచర్‌గా పాఠాలు చెప్పి సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీకొచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. దర్శకుడిగా విలక్షణమైన కథలను తెరపై ఆవిష్కరించడమే కాకుండా అభిరుచి గల నిర్మాతగానూ తనదైన పంథాలో దూసుకెళ్తున్నారు. హృద్యమైన ప్రేమ కథా చిత్రాలతో పాటు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఎమోషన్స్‌పై కథను నడిపించడంలో సుక్కు లెక్కే వేరు. అంతేకాదు పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు పేరు మీద తూర్పు గోదావరి జిల్లా, మట్టపర్రు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రెండతస్థుల భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

నాన్న మీదున్న ప్రేమతో ఆయన జ్ఞాపకార్థం ఈ భవనం కట్టిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ ఖర్చు దాదాపు రూ.14 లక్షలు అవుతుందని తెలియగా, అంతా తానే ఇస్తానని చెప్పినట్టు టాక్. కాగా, సుక్కు పెద్దన్నయ్య బండ్రెడ్డి వెంకటేశ్వర రావు స్కూల్ బిల్డింగ్‌కు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా భవనం పూర్తి చేయాలని సుక్కు సూచించినట్టు తెలుస్తోంది. మూవీస్ విషయానికొస్తే ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప’ సినిమాలో సుక్కు బిజీగా ఉన్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

Next Story