- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి కుటుంబంలో కరోనా
దిశ ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా నగరిలో అతిపెద్ద కుటుంబానికి కరోనా సోకింది. కుటుంబంలోని 22 మందికి కరోనా సోకిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. 84 ఏళ్ల ప్రముఖ వ్యక్తి నిన్న అనారోగ్యానికి గురి కావడంతో చిత్తూరులోని స్విమ్స్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయనది ఉమ్మడి కుటుంబం. ఆయనకు నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో సుమారు 25 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. అలాంటి కుటుంబంలో వారం క్రింతం ఆయన భార్య మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చారు. దీంతో మూడు రోజుల క్రితం ఆయన కుమారుడు కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరాడు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ కుటుంబంలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. మరోవైపు, అదే వీధిలో ఉన్న ఒక వైద్యుడితో పాటు ఆయన ఇంట్లో ఉన్న ఐదుగురికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.