- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనుమానంతో అంత్యక్రియలకు దూరం..

X
దిశ, కొత్తగూడెం: కరోనాతో చనిపోయాడని వృద్ధుడి అంత్యక్రియలకు గ్రామస్తులు సహకరించని సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య గుండెపోటుతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.
అయితే వెంకయ్య కరోనాతోనే చనిపోయాడని గ్రామంలో ప్రచారం జరగడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు గ్రామస్తులెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. బానోత్ రంజిత్‌కుమార్ తన ట్రాక్టర్‌లో మరో ముగ్గురు గ్రామస్తులు కలిసి గ్రామ శివారుకు తీసుకెళ్లి ఖననం చేశారు.
Next Story