- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీతారామస్వామి సన్నిధిలో అపశృతి.. అకస్మాత్తుగా కూలిన ధ్వజస్తంభం

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని అపశృతి చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఆలయంలోని ధ్వజస్తంభం కూలిపోవడంతో ఆలయ నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో సూర్యకళ ధ్వజస్థంభాన్ని పరిశీలించారు. సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించారు. ఎవరి ప్రమేయం లేకుండానే కూలిపోయిందని నిర్ధారించారు.
పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయిందని వివరించారు. కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు.
Next Story