కమల్‌కు విలన్‌గా ఫహద్ ఫాజిల్?

by Shyam |
కమల్‌కు విలన్‌గా ఫహద్ ఫాజిల్?
X

దిశ, వెబ్‌డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా ‘విక్రమ్’ టీజర్‌ అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంది. మాస్టర్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న గ్యాంగ్‌స్టర్ ఫ్లిక్‌ టీజర్ 15 మిలియన్ వ్యూస్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాకు సంబంధించి ఇది పాజిటివ్ న్యూస్ కాగా.. మరో పాజిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. క్రిటికల్లీ అక్లేమ్డ్ మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని టాక్. ఇదే నిజమైతే.. పవర్ ప్యాక్డ్ కాస్ట్‌తో లోకేశ్ మరో పవర్‌ఫుల్ హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. ఈ వార్తతో కమల్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

Advertisement

Next Story