గాయం.. మానసిక ప్రభావమే ఎక్కువ : ఫాహద్

by Jakkula Samataha |
గాయం.. మానసిక ప్రభావమే ఎక్కువ : ఫాహద్
X

దిశ, సినిమా : మలయాళీ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్ మార్చి ప్రారంభంలో షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ముందుగా చిన్నగాయమే అనుకున్నా, దీని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతోందన్న హీరో.. త్వరలోనే గాయాలకు కుట్లు విప్పేస్తారని చెప్పాడు. ‘మలయన్‌కుంజు’ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరగగా.. ల్యాండ్‌ స్లైడ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు వేగంపై నియంత్రణ కోల్పోయి కింద పడిపోయినట్టు ఫాహద్ తెలిపాడు. వైద్యం కోసం వెళ్లినప్పుడు గాయం తీవ్రత గురించి వైద్యులు వివరించారని, ముందుగా వారం రోజుల్లో నార్మల్ అయిపోవచ్చని అనుకున్నా గానీ అది జరగలేదన్నాడు. అయితే త్వరలో మళ్లీ ట్రాక్‌లోకి తిరిగి రావడం అవసరమని అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనను ప్రకృతి హెచ్చరికగా అభివర్ణించిన ఫాహద్.. తనకు తరచూ ఇలాగే జరుగుతుందని అన్నారు. తను ఒకే ప్లేస్‌లో ఎక్కువ కాలం ఉండలేనని, ఇది ఫిజికల్‌గా కన్నా మెంటల్‌గా ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు.

Advertisement

Next Story