కమల్ హాసన్‌తో పోటీపడుతున్న స్టార్ హీరో..

by Jakkula Samataha |
కమల్ హాసన్‌తో పోటీపడుతున్న స్టార్ హీరో..
X

దిశ, సినిమా : మాలీవుడ్ సూపర్‌స్టార్ ఫాహద్ ఫాజిల్ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. టాలీవుడ్ ప్రాజెక్ట్‌ ‘పుష్ప’లో విలన్‌గా చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించగా.. లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ లోకేశ్ కనకరాజు కాంబినేషన్‌లో వస్తున్న ‘విక్రమ్‌’లోనూ తను మెయిన్ విలన్‌గా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఫాహద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. దీంతో ‘విక్రమ్‌’లో విలన్ ఎవరన్న చర్చకు ఫుల్‌స్టాప్ పడింది.

ముందుగా ‘విక్రమ్’ సినిమాలో మెయిన్ యాంటిగోనిస్ట్‌గా రాఘవ లారెన్స్‌ను ఫైనలైజ్ చేసినా.. తను ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో విలన్ క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ‘ఇండియన్ 2’ సినిమాకు తనను సంప్రదించినా చేయలేకపోయానని ఓ ఫంక్షన్‌లో విజయ్ సేతుపతి రివీల్ చేయడం, మరో చాన్స్ ఇవ్వాలని కమల్‌ను కోరడంతో.. ‘విక్రమ్‌’లో సేతుపతి ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ అయిపోయాడు. పైగా తను విలన్‌గా చేసిన ‘మాస్టర్’ దర్శకులే ఈ మూవీని కూడా డైరెక్టర్ చేస్తుండగా.. సేతుపతికే ఈ అవకాశం దక్కిందని అనుకున్నారు. కానీ ఫాహద్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని ప్రకటించడంతో రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడింది.

Advertisement

Next Story