'ఓఈఎం, డీలర్ల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు అధ్యయనం'!

by Harish |
ఓఈఎం, డీలర్ల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు అధ్యయనం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో రంగంలోని మార్కెట్ సెంటిమెంట్‌ను అంచనా వేయడానికి, కీలకమైన ఒరిజినల్ పరికరాల తయారీదారులు(ఓఈఎం), డీలర్ల భాగస్వామ్యాన్ని ప్రభావితం చేసే అంతరాయాలను గుర్తించేందుకు ఎఫ్ఏడీఏ అధ్యయనాన్ని రూపొందించనుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ) ఈ అధ్యయనం కోసం సింగపూర్ ఆధారిత ప్రముఖ కన్సల్టింగ్, సలహా సంస్థ ప్రీమోన్ ఏషియాకు అప్పగించనుంది. ఈ అధ్యయనాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను సరైన ప్రమాణాల్లో నిర్వహించనున్నారు. తుది నివేదిక ఈ ఏడాది జూన్ చివరి నాటికి వెల్లడించనున్నట్టు ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేష్ గులాటి చెప్పారు.

‘ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న కీలకమైన సమయంలో నిర్వహిస్తున్నాం. డీలర్‌షిప్ నిర్వహణకు సంబంధించి లోతైన అంశాలను పరిశీలిస్తాం. లాభదాయకమైన, స్థిరమైన డీలర్ నెట్‌వర్క్‌ను కొనసాగించేందుకు తయారీదారులు అనుసరించే ఉత్తమ పద్ధతులను వెలువరిస్తామని ఎఫ్ఏడీఏ కార్యదర్శి సీఎస్ విఘ్నేశ్వర్ వివరించారు. ‘గతేడాది చరిత్రలోనే మొదటిసారి పరిశ్రమ తీవ్ర పరిణామాలను చూసిది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పరిశ్రమ అభివృద్ధి దిశగా పయనిస్తోందని ప్రీమోన్ ఆసియా వ్యవస్థాపకుడు, సీఈవో రాజీవ్ లోచన్ వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా ఎఫ్ఏడీఏ 26,500 ఢీపర్‌షిప్‌లను, 15 వేల మంది డీలర్లను కలిగి ఉంది.

Advertisement

Next Story