- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూలై లో భారీగాపెరిగిన పారిశ్రామికోత్పత్తి.. ఎంతంటే ?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పరిస్థితులు మెరుగుపడటంతో దేశీయ పారిశ్రామికోత్పత్తి జూలైలో 11.5 శాతం పెరిగింది. ఇది గతేడాది కొవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తక్కువ బేస్ ఎఫెక్ట్ వల్ల పెరిగిందని గణాంకాలు పేర్కొన్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ఉత్పత్తి 10.5 శాతం పుంజుకోగా, మైనింగ్ 9.5 శాతం, విద్యుత్ ఉత్పత్తి 11.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. గతేడాదితో పోలిస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్ గణనీయంగా పెరిగి 20.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
అయితే, నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి 1.8 శాతం క్షీణించింది. కాగా, ప్రస్తుత ఏడాది జూలైలో కోర్ సెక్టార్ 9.4 శాతం వృద్ధి సాధించింది. ఇది గతేడాదితో పోలిస్తే గణనీయంగా ఎక్కువే. ఆర్థికవ్యవస్థ పుంజుకునే అంశంపై ఆశాజనకంగా ఉన్నామని, సెకెండ్ వేవ్ పరిస్థితులు ఆర్థికవ్యవస్థను దెబ్బ తీసినప్పటికీ వీ-షేప్ రికవరీ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.