- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్ ముఖాలకు రూపం!
దిశ, ఫీచర్స్ : ఎన్నో విప్లవాత్మక మార్పులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. తాజాగా శాస్త్రవేత్తలు 2000 ఏళ్ల కిందటి డీఎన్‌ఏ ఉపయోగించి ముగ్గురు పురాతన ఈజిప్షియన్ పురుషుల ముఖాలకు ప్రాణం పోశారు. ఇవి 2,023 నుంచి 2,797 సంవత్సరాల ఓల్డ్ డీఎన్‌ఏ శాంపిల్స్ అని అంచనా వేస్తుండగా.. ఇంతటి పురాతన డీఎన్‌ఏపై ఆధునిక పద్ధతులు ఉపయోగించడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.
ఈ ముగ్గురిని JK2134, JK2888, JK2911గా సూచించిన సైంటిస్టులు.. వరుసగా 776-569 BC, 97-2 BC, క్రీస్తుపూర్వం 769-560 కాలంలో నివసించినట్లు అంచనా వేస్తున్నారు. పురాతన ఈజిప్షియన్ మమ్మీల లక్షణాలను ‘పారబోన్ నానోల్యాబ్స్’ కంపెనీ ఆవిష్కరించింది. 25 ఏళ్ల వయస్సులో ఆ పురుషుల రూపం ఎలా ఉందో అంచనా వేయడానికి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో పాటు ఫోరెన్సిక్ ఆర్టిస్ట్‌ను ఉపయోగించారు. ఈ మమ్మీలు.. ‘అబూసిర్ ఎల్-మెలెక్’ అని పిలువబడే పురాతన నైలు కమ్యూనిటీకి చెందినవి. వారి పూర్వీకులు ఈజిప్షియన్‌ల కంటే ఆధునిక మధ్యధరా, మధ్యప్రాచ్య వ్యక్తులకు మరింత దగ్గరగా ఉన్నట్టు ఈ బృందం గుర్తించింది. లేత గోధుమరంగులో నల్లటి జుట్టు, కళ్ళతో ఎటువంటి మచ్చలు లేనివిధంగా వారి రూప లక్షణాలున్నాయని నిర్ధారించారు.
లో కవరేజ్ ఇంప్యుటేషన్ రంగంలో బయోమెట్రిక్ అడ్వాన్సెస్ కారణంగా మాత్రమే ఈ పని సాధ్యమైందని దీనికి నాయకత్వం వహించిన పారాబోన్ బయోఇన్‌ఫర్మాటిస్ట్, WGS ఎనలిస్ట్ డా. జానెట్ కాడీ తెలిపారు. ‘ఫోరెన్సిక్ మైక్రోఅరే విశ్లేషణలో ‘పారాబోన్’ కంపెనీ సంవత్సరాలుగా అగ్రగామిగా ఉంది.‘ఇంప్యుటేషన్’ దశను అనుసరించి పారబోన్.. తన ‘స్నాప్‌షాట్ DNA ఫినోటైపింగ్ పైప్‌లైన్’ను మూడు పురాతన మమ్మీ నమూనాలకు వర్తింపజేసి, ప్రతీ మమ్మీకి చెందిన పూర్వీకులు, పిగ్మెంటేషన్, ముఖ స్వరూపాన్ని అంచనా వేసింది. అలా త్రీ డైమెన్షనల్ ఫేస్ మార్ఫాలజీ ద్వారా సదరు పురుషుల ఫ్రంట్, సైడ్ ప్రొఫైల్స్‌ను అలాగే ఫేషియల్ హీట్ మ్యాప్‌ను వెల్లడించింది.