- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2,600 ఏళ్ల కిందటి రాజు ముఖం.. పున:సృష్టి
దిశ, వెబ్‌డెస్క్: 1997లో దక్షిణ సైబీరియాలోని తువాలో సైబీరియన్ సార్, అతని భాగస్వామి అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనగా, 2,600 ఏళ్ల క్రితం వారు చనిపోయినట్లుగా నిర్ధారించారు. అయితే వారి పుర్రెల ఆధారంగా, పరిశోధకులు 3డి టెక్నాలజీ ఉపయోగించి వారి ముఖాలను పునర్నిర్మించారు. లేజర్ స్కానింగ్, ఫొటోగ్రామెట్రీ ఆధారంగా శాస్త్రవేత్తలు సార్, అతని భార్య ముఖాలను పున:సృష్టి చేశారు. రాజు పుర్రె చాలా భాగం వరకు లేకపోయినా, శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి, దానికో రూపుతీసుకొచ్చారు.త
ఖననం చేసే సమయంలో వారిని ఎలా సిద్ధం చేశారో, 3డి మోడల్స్ సిద్ధమైన తరువాత అచ్చు అలానే తయారు చేశారు. ‘సార్ పుర్రె సగం మాత్రమే ఉండటంతో మిగతా సగం పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే మిగిలి ఉన్న పార్ట్ వల్లే డిస్ట్రాయ్ అయిపోయిన ముఖాన్ని పూర్తి చేయగలిగాం. మిస్సింగ్ అయిపోయిన ప్రతి పార్ట్‌ను పున:సృష్టించడం అంతా తేలిక కాదు ఇందుకు చాలా సమయం పట్టింది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.