ఫేస్‌బుక్ ఉద్యోగుల వర్చువల్ వాకౌట్

by  |
ఫేస్‌బుక్ ఉద్యోగుల వర్చువల్ వాకౌట్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ధోరణికి నిరసనగా ఆ సంస్థ ఉద్యోగులు వర్చువల్ వాకౌట్ చేస్తున్నారు. కొవిడ్ క్వారంటైన్ కారణంగా ప్రస్తుతం ఇంటి దగ్గరి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులందరూ తాము వర్చువల్ వాకౌట్ ప్రకటిస్తున్నట్లు తెలియజేయడానికి చిహ్నంగా తమ లాగిన్ స్క్రీన్ల మీద హింసకు నిరసనగా వాల్‌పేపర్లు పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా తమ డిమాండ్లను కూడా స్క్రీన్ మీద పెట్టినట్లు తెలుస్తోంది.

హింసను ప్రేరేపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టులను ట్విట్టర్ ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అవే పోస్టుల మీద ఫేస్‌బుక్ మాత్రం ఎలాంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉండిపోవడం ఉద్యోగులకు రుచించలేదు. అంతేకాకుండా ఈ పోస్టుల గురించి నేరుగా ట్రంప్, జుకర్‌బర్గ్‌తో మాట్లాడారని తెలిసిన తర్వాత వారు ఊరికే ఉండలేకపోయారు. హింసను ప్రేరేపించే పోస్టుల కారణంగా ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అల్లకల్లోలానికి ఆజ్యం పోసినట్లయిందని ఉద్యోగుల అభిప్రాయం. ఈ విషయమై న్యాయం కోసం పోరాడుతున్న వారికి జుకర్‌బర్గ్ పది మిలియన్ల విరాళం ప్రకటించినప్పటికీ ఉద్యోగుల మనోభావాలు శాంతపడలేదు. అందుకే వారు సోమవారం పూర్తి స్థాయి వర్చువల్ వాకౌట్ పాటించారు. తమ డిమాండ్ ప్రకారం ట్రంప్ పోస్టులను డిలీట్ చేయకపోతే వాకౌట్ కొనసాగిస్తామని వారు గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed