- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారికి ‘ట్రంప్’ చనిపోతే బాగుండట..!
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ :
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ చికిత్స పొందుతుండగా.. ట్రంప్ వ్యతిరేకులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ట్రంప్ కరోనా నుంచి కోలుకోకూడదని, అలాగే చనిపోవాలని పోస్టులు పెడుతున్నట్లు తేలింది.
దీనిపై స్పందించిన ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు ఆ పోస్టులను తొలగించినట్లు ప్రకటించాయి. ఇకమీదట అలాంటి పోస్టులు ఎవరు పెట్టినా వెంటనే వారి అకౌంట్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించాయి. కాగా, ట్రంప్ చనిపోవాలని కోరుకున్న వారిలో ఎక్కువగా చైనీయులే ఉన్నట్లు ఆ సంస్థలు గుర్తించాయి.
Next Story