- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాస్క్‌ను గుర్తు చేసే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో.. కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాలోనూ పరిస్థితి అలానే ఉంది. శాస్త్రవేత్తలంతా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనప్పటికీ.. వాటి ఫలితాలెలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. వ్యాక్సిన్ సంగతి పక్కన పెడితే.. కరోనా కేసులు పెరగడానికి ప్రజల నిర్లక్ష్య ధోరణే కారణమని మన దేశ ప్రధాని మోడీ కూడా ఇటీవలే అన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. మన వంతుగా చేయాల్సిన పనేంటంటే.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం.. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం. ఈ క్రమంలోనే తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా పదే పదే మాస్క్ పెట్టుకోమని గుర్తు చేసేందుకు ఓ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేశాయి.
మాస్క్ ఇంపార్టెన్స్‌ను ఇప్పటికే వైద్యులతో పాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మాస్క్ పెట్టుకోమని తమ యూజర్లకు గుర్తు చేస్తున్నాయి. టాప్ ఆఫ్ ది న్యూస్ ఫీడ్ మీద ఈ ఫీచర్ రోల్ అవుతోంది. అంతేకాదు ప్రివెన్షన్ టిప్స్, సీడీసీ, జీవోవీ లింక్, కొవిడ్ -19 ఇన్ఫర్మేషన్ సెంటర్ లింక్స్ కూడా అక్కడ కనిపిస్తాయి. అయితే ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది. అమెరికాలో గురువారం వరకు 2.68 మిలియన్ల కేసులు నమోదయ్యాయి.