- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పీజీఈసెట్ ఫైనల్ ఫేస్‌కు గడువు పొడిగింపు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : పీజీఈసెట్ సెకండ్, ఫైనల్ఫేస్ కౌన్సిలింగ్‌కు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అభ్యర్థులు 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్, సంబంధిత ధృవపత్రాలను అప్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 1వ తేదీన ఫేస్2 కు సంబంధించిన అభ్యర్థుల జాబితా, డిసెంబర్ 2, 3 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 4, 5 తేదీల్లో సవరణల కోసం వెబ్ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. 7వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను కళాశాలల వారీగా వెబ్‌సైట్‌లో ఉంచుతారు. డిసెంబర్ 8 నుంచి 10వ తేదీలోపు అభ్యర్థులు సంబంధిత కాలేజీలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Next Story