ఆ దేశంలో కొవిడ్ కట్టడికి కఠిన లాక్‌డౌన్..

by vinod kumar |
ఆ దేశంలో కొవిడ్ కట్టడికి కఠిన లాక్‌డౌన్..
X

దిశ, వెబ్‌డెస్క్: సంవత్సరం గడుస్తున్నా, కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ఇంకా తయారీ కాలేదు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం యూరప్‌లో 1.3 మిలియన్ల కొత్త కేసులు నమోదు కాగా, జర్మనీ, యూకేల్లోనూ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దాంతో ఈ మహమ్మారి కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. అలా లాక్‌డౌన్ విధిస్తున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ సిటీలో ఓ హోటల్‌ క్లీనర్‌ ద్వారా 23 మందికి వైరస్‌ సోకింది. వైరస్‌ బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేకపోవడంతో ఆఫీసర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన ఆస్ట్రేలియా ప్రభుత్వం కొవిడ్ సెకండ్‌ వేవ్‌ కట్టడి కోసం కఠిన లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌డోర్‌ ఎక్సర్‌సైజ్‌‌, డాగ్‌ వాకింగ్‌కు బయటకు రావద్దని ఆదేశించింది.

వారంలో ఆరు రోజుల్లో ఇంటిలో కేవలం ఒక్కరికి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని, అది కూడా చాలా ముఖ్యమైన కారణాలకు మాత్రమే అని తెలిపింది. స్కూల్స్, కాలేజీలు, రెస్టారెంట్లు, యూనివర్సిటీలు, కేఫ్‌లను మూసేయాలని ఆదేశించింది. పెళ్లిల్లు, చావులకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా పూర్తి నిషేధం విధించింది. ఇక మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. ‘చాలా త్వరగా.. చాలా కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు చేయాలి. అప్పుడే తక్కువ నష్టం వాటిల్లుతుంది’ అని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story