కొత్త బార్లకు దరఖాస్తులు.. ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే.?

by Shyam |
కొత్త బార్లకు దరఖాస్తులు.. ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే.?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్త బార్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో కొత్తగా ఏర్పడిన భీంగల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. 16 బార్లకు 265 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.2.65 కోట్ల ఆదాయం సమకూరింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏడు, బోధన్​లో మూడు బార్లను దక్కించుకునేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేట్​కావడం, లైసెన్స్ పీజు రూ.42 లక్షలు ఉండడం, చాలా వైన్​షాపులకు పర్మిట్​రూంలు ఉండడంతోనే తక్కువగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. గడువు పొడిగించినా జిల్లాలో దరఖాస్తులు పెరగక పోవడం గమనార్షం. ఇందుకు సంబంధించిన ఈ నెల 18న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్​ కార్యాలయాల్లో లక్కీ డ్రా నిర్వహించనున్నారు.

నిజామాబాద్ ​జిల్లాలో

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 12 బార్లకు అధికారులు నోటిఫికేషన్​ ఇచ్చారు. నిజామాబాద్​నగరంలో ఏడు బార్లకు కు 23 దరఖాస్తులు వచ్చాయి. అలాగే బోధన్​లోని 3 బార్లకు తొమ్మిది, ఆర్మూర్ లో బార్​కోసం 14 రాగా, కొత్తగా ఏర్పడిన భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసే బార్ కోసం 46 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో

జిల్లాలో నాలుగు కొత్త బార్ల కోసం 173 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలైన ఎల్లారెడ్డిలో బార్​కోసం 47, బాన్సువాడలో రెండు బార్లకు 71 దరాఖాస్తులు వచ్చాయి. కామారెడ్డిలో ఇదివరకు ఒక్కటి ఉండగా, కొత్తగా ఏర్పాటు కానున్న బార్​ కోసం 55 మంది ఔత్సహికులు దరఖాస్తు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో బార్ల కోసం దరాఖాస్తుల ద్వారా రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed