- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రణలో భాగంగా మద్యం ధరలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారంతా సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు దీనిని వ్యాపార మార్గంగా మలచుకుంటున్నారు. అలా వ్యాపార మార్గంగా మలచుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్ కుమార్ అలియాస్ విక్కీ ఎక్సైజ్ అధికారులు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…
గత నెల 30న ‘కేఏ 34 ఏ 5856’ నంబర్ గల టాటా ఏస్ వాహనంలో 624 కర్ణాటక మద్యం బాటిళ్లతో విక్రమ్ వస్తుండగా, రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్ చెక్‌పోస్టులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ధనుంజయ పట్టుకున్నారు. విక్రమ్‌తో పాటు వాహన యజమాని మహమ్మద్ అన్సర్, ఆసిఫ్, విశాల్ రాజ్ మహార్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, వీరు తరచూ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని తమ విచారణలో వెల్లడైందని అన్నారు. కాగా, వీరిపై కేసు నమోదు చేయవద్దని పై స్థాయిలో వత్తిళ్లు వచ్చినట్టు సమాచారం.