- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీది కానప్పుడు స్టే ఎందుకు తెచ్చుకున్నావ్?

దిశ, కరీంనగర్:
ఫాం హౌజ్ నీది కానప్పుడు హై కోర్టును ఆశ్రయించి స్టే ఎందుకు తెచ్చుకున్నావని మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అవినీతికి పాల్పడితే కొడుకైనా, కూతురైనా ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారని కానీ, ఆయన మాటలకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఎక్కడై నిజాయితీ పాలన జరగడం లేదన్నారు. ఆ ఫాంహౌజ్‌లో కేసీఆర్ నివాసం ఉంటున్నారని రాజేంద్రనగర్ కోర్టులో మార్చి 12న పోలీసులు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్నొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఓ సారి ఫాంహౌజ్‌కు తాము మీటింగ్‌లకు హాజరయ్యామని చెప్పి ఇప్పుడేమో ఆయనకు సంబంధమే లేదంటున్నాడని వివరించారు. సిరిసిల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణకు అన్యాయం జరిగిందనే నాడు పోరాటం చేశామని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సాగునీటి సమస్యను పరిష్కరించినట్టయితే తాము చేపట్టే జలదీక్షను అడ్డుకోవద్దన్నారు. తమ పార్టీ తరఫున ఇప్పటికే డీఎస్పీ అనుమతి కోరామని, అయితే దీక్ష నిర్వహించే రోజున అరెస్ట్ చేయాలన్నఆదేశాలు ఇవ్వవద్దని పొన్నం డిమాండ్ చేశారు. ఇటీవల తాను ఆందోళన చేపట్టిన తర్వాతే కేటీఆర్ మల్కపేట రిజర్వాయర్‌ను సందర్శించారని అంతకు ముందు ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారో చెప్పాలన్నారు.