- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ప్రేమ ఒలకబోస్తున్నారు: కొండా
దిశ, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులకు సాగునీరు అందించేందుకు లక్ష్మిదేవిపల్లి రిజర్వాయరే దిక్కని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలు లక్ష్మిదేవిపల్లి వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి ఇండ్లకే పరిమితం చేశారు. దీంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి.. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టి.. ఎన్నికలు అయిన తరువాత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. జగన్‌కు మద్దతుగానే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు.