కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

by Anukaran |
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ కు చెల్లెలు కవిత రాఖీ కట్టింది. నేడు రాఖీ పండుగ సందర్భంగా ప్రగతి భవన్ లో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు, ఆయన సతీమణికి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టి ఆశీర్వచనం అందుకున్నది.

అదేవిధంగా మంత్రులు సత్యవతి రాథోడ్, సబిత, ఎమ్మెల్యే సునీత, గుండు సుధారాణితోపాటు పలువురు మహిళా నేతలు మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story