- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wemula Weerasinghe: ప్రజాసేవ కంటే నా జీవితం ముఖ్యం కాదు : వేముల
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తానని, నా కుటుంబం కన్నా ప్రజల బాధలు,సుఖ సంతోషాలే నాకు ముఖ్యమని ఉద్దీపన చైర్మన్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ప్రజాసేవ కోసం నా జీవితాన్ని కూడా లెక్కచేయనని ఆయన పేర్కొన్నారు. నకిరేకల్‌లోని ఆఫీసర్స్ కాలనీకి చెందిన అచల పరిపూర్ణ కర్నాటి పాండరమ్మ రాజయోగి కరోనాతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి వేముల వీరేశం తన అనుచరులతో కలిసి అంత్యక్రియలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాతో మరణించిన వారికి బంధువులు దహన సంస్కారాలు చేయకపోతే తాను దగ్గరుండి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా నకిరేకల్ పట్టణ ప్రజలు మాట్లాడుతూ కరోనాతో మృతి చెందితే కుటుంబ సభ్యులే దగ్గరకు రాని పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పీపీఈ కిట్ కూడా లేకుండనే అంత్యక్రియలు నిర్వహిస్తూ నేనున్న మీకు అండగా అని చాటి చెబుతున్నాడని కొనియాడారు. చికిత్స చేయించుకోలేని వారికి ఆర్థికసాయం చేయడంతోపాటు అంత్యక్రియలను కూడా తన సొంత ఖర్చులతో చేస్తూ, మృతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి మా పట్టణంలో ఉన్నందున ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.