తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తోంది

by Anukaran |
తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తోంది
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీ చంద్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశాలం అగ్నిప్రమాద ఘటనను పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story