- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పరిస్థితుల్లో చేయనంటే ఎట్లా ?.. కంటిన్యూ చేయండి
దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో వరి పంట కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయకట్టు పరిధిలో రైతులు వరి సాగుపైనే ఆధారపడ్డారని, ఈ పరిస్థితుల్లో వరి కొనుగోళ్లు చేయమన్న ప్రభుత్వాల ప్రకటన రైతుల్లో ఆందోళన పెంచుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కనీస మద్దతు ధర కలిగిన వరి సాగు ద్వారానే రైతులకు లాభం చేకూరుతుందని, ఈ ప్రాంత రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఐకేపీ కేంద్రాల ద్వారా వరి కొనుగోళ్లు కొనసాగించాలని కోరారు. అవసరమైతే అఖిలపక్ష పార్టీలను ఢిల్లీ తీసుకెళ్లి ప్రధాని మోడీని ఒప్పించాలన్నారు. లేనిపక్షంలో లక్షలాది రైతులు, కూలీలు, రైస్ పరిశ్రమ సంక్షేమం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు డబీకార్ మల్లేష్, జగదీశ్చంద్ర, రవినాయక్, శశిధర్ రెడ్డి, పరశురాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.