- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డీఎస్‌తో ఈటల భేటీ.. మధ్యలో వచ్చిన ధర్మపురి.. ఏం జరిగింది..?
by Anukaran |

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఇద్దరూ చర్చించారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. రాజకీయ పరిణామాలపై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల ఈ సందర్భంగా వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. డీఎస్‌తో భేటీ అయిన సమయంలోనే అక్కడకు వచ్చిన డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల కలిశారు. దాదాపు 20 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇప్పటికే ఈటల… సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే.
Next Story