- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన గెలిస్తే టీఆర్ఎస్‌లోకి వెళ్లడం ఖాయం
దిశ, దుబ్బాక :
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే ఆయన మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి పోడని గ్యారెంటీ ఏముందని మాజీమంత్రి బాబు మోహన్ అన్నారు. గత ఆరేండ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, దివంగత నేత రామలింగారెడ్డి ఏమీ చేయలేదనీ.. ఇప్పుడు ఆయన సతీమణిని గెలిపిస్తే ఏం చేస్తుందని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రచార ర్యాలీలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….అభివృద్ధిలో దుబ్బాక వెనుకబడి పోయిందని స్థానిక బస్టాండ్‌ను చూస్తే తెలిసిపోతుందని అన్నారు. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందడం లేదని అన్నారు. ఎన్నికల ముందు హరీశ్ రావు హడావిడి చేస్తున్నాడని అన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ ఇదే హడావిడి ఉంటుందా అని అన్నారు. బండి సంజయ్‌కు సవాల్ విసిరే అర్హత హరీశ్ రావుకు లేదని అన్నారు. ఆయనతో చర్చకు తాను సరి పోతాననీ అన్నారు.