- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం, 11 మంది హస్తం పార్టీని వీడారు. వివరాల ప్రకారం.. మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా సహా 11 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరారు.
అయితే.. నెల రోజులు క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సంగ్మా సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ అధినేత విన్సెంట్ హెచ్ పాలా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ సీఎం సంగ్మాకు ఆయను విభేదాలు వచ్చాయి. అంతేకాకుండా పాలాను నియమించే సమయంలో తనను సంప్రదించలేదని సంగ్మా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తమ డిమాండ్లను సంగ్మా ఇది వరకే తెలియజేశారు. అయినా పార్టీ ఆ విషయాలను పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీని వీడినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా మేఘాలయలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సంగ్మా టీఎంసీలో చేరడంలో కాంగ్రెస్‌కు పెద్ద కుదుపు అని స్థానికంగా పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మేఘాలయలో టీఎంసీ ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది.