- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహనీయుడు సంత్ గాడ్గే బాబా: విద్యాసాగర్ రావు
దిశ, ముషీరాబాద్: స్వచ్ఛత కోసం తన జీవితకాలం కృషి చేసిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ నిర్వహించారు. వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. వంశీ తిలక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొని సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ ఆశావాది ప్రకాశరావు రచించిన సంత్ రవిదాసు బోధన పద్య పుస్తకం, సంత్ గాడ్గే బాబా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… సంత్ గాడ్గే బాబా ఎప్పుడూ చేతిలో చీపురు, నెత్తిన అన్నం తినే చిప్పతో సంచరించే వారన్నారు. గ్రామంలో వీధి వీధి తిరుగుతూ శుభ్రం చేస్తూ ప్రజలను చైతన్య పరిచే వారని తెలిపారు. వారి జీవిత కాలంలో ఎన్నో విద్యాసంస్థలను స్థాపించారని చెప్పారు. పేద,దళిత, అట్టడుగు వర్గాలను ఉద్ధరించడం విద్య ద్వారానే సాధ్యమని ఆయన నమ్మారని అననారు. ఆయన 31 పాఠశాలలు, పదిహేను వసతి గృహాలు, బాల బాలికల పాఠశాలలు, గోశాలలు, ధర్మ సత్రాలు అనేకం నెలకొల్పారన్నారు. సేవారంగంలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన గొప్ప వ్యక్తి సంత్ గాడ్గే బాబా అని కొనియాడారు.