స్వచ్ఛ మేడ్చల్‌లో అందరూ భాగస్వామ్యం కావాలి

by Shyam |   ( Updated:2021-12-16 07:35:56.0  )
Swachha Survekshan
X

దిశ, మేడ్చల్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 లో భాగంగా “జీరో వేస్ట్ కనెక్షన్”ఈవెంట్ ను పట్టణంలోని “శ్రీ సాయి బాబా మందిరం”లో చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి, కమిషనర్ అహ్మద్ షఫీయుల్లాహ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దీపికా మాట్లాడుతూ.. సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ గ్లాసులు, సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఉండడం వల్ల వేస్టేజ్ ఉత్పత్తి అతి తక్కువగా ఉంటుందని, ఇది అభినందనీయమని అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను తినడం వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. దీనివల్ల భూమి కాలుష్యం అవుతుందన్నారు.

అందువల్ల ప్రజలు ఇళ్లలో, ఇతర ప్రదేశాలలో జరిపే వేడుకలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వేస్టేజ్ ఉత్పత్తి అతి తక్కువగా ఉండేటట్లు చూసుకుని, పర్యావరణ కాలుష్య నివారణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీర్ల రమేష్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ రామ్ చందర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అఖిల్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed