- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆతిథ్య రంగంలో అవెరెస్ట్ హోటల్స్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో అవెరెస్ట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో జాతీయ, అంతర్జాతీయంగా తమ గ్రూప్ విస్తరణ చేయనున్నారు. అవెరెస్ట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండ్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. అవెరెస్ట్ గ్రూప్ నుంచి మొట్టమొదటి ప్రోపర్టీ హైదరాబాద్‌లో ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది జనవరి నెలలో తెరుచుకోనుంది. ఇది వ్యూహాత్మకంగా గచ్చిబౌలి వద్ద ఏర్పాటు చేశారు. మిడ్ సెగ్మంట్ హోటల్ ఇది. కార్పొరేట్, పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. రాబోయే మూడేళ్లలో దేశ, విదేశాల్లో 20 వరకు అవెరెస్ట్ బ్రాండెడ్ ప్రోపర్టీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా అవెరెస్ట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ పీకె అనంత శర్మ మాట్లాడుతూ ఆతిథ్య రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐతే ఈ సంవత్సరం ఆతిథ్య రంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కానీ 2021 సంవత్సరం మాత్రం ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఎండీ ఎన్.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హోటల్ మేనేజ్‌మెంట్‌లో సమగ్రమైన విధానం ద్వారా సంపూర్ణమైన ఆతిథ్య అనుభవాలను అందించేందుకు అవెరెస్ట్ గ్రూప్ లక్ష్యంగా చేసుకుందన్నారు.