అంగ ప్రవేశం జరగకపోయినా అత్యాచారమే..

by Sumithra |
అంగ ప్రవేశం జరగకపోయినా అత్యాచారమే..
X

దిశ, వెబ్‌డెస్క్ : అత్యాచారం చేయడం.. చట్టంలోని లొసుగులను అడ్డంపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకునేందుకు కామాంధులు ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది. అలాంటి కీచకుల పీచమనిచేలా ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు కేసు నుంచి తప్పించుకోకుండా చెక్ పెట్టింది. మైనర్ బాలికను పెంపుడు తండ్రి అత్యాచారం చేసిన కేసులో ఈ కామెంట్స్ చేసింది.

ఔరంగాబాద్ జిల్లాలోని పైతాన్ గ్రామానికి చెందిన సంతానం లేని దంపతులు ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. పెంపుడు తండ్రికి 74 ఏళ్లు. కాగా బాలిక తల్లి 2016 డిసెంబర్ 16న పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో బాలిక, తండ్రి మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న దత్త కూతురిని చూసి తండ్రికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. తాను వివస్త్రనగా మారి తన 14 ఏళ్ల కుమార్తె దుస్తువులను బలవంతంగా తొలగించాడు. అనంతరం ఆ రాత్రంతా ఆమెపై అత్యాచారానికి యత్నిస్తూ అంగ ప్రవేశం చేయబోయాడు. కానీ సాధ్యపడలేదు. అయినప్పటికీ బాలిక పట్ల లైంగిక దాడి కొనసాగింది.

ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత బాలిక ఈ విషయాన్ని స్కూల్ టీచర్లతో చెప్పింది. వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో
అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ సాగించిన పోక్సో కోర్టు 2019 జులై 10న అతడిని దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును అతడు ముంబై హైకోర్టులో సవాల్ చేశాడు. తాను అత్యాచారం చేయలేదని, అత్యాచారం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వాదించాడు. అసలు అంగ ప్రవేశం జరగలేదని పేర్కొన్నాడు. ఆస్తి వివాదంలో తన భార్య సోదరులు తనను ఇరికించాడానికి బాలికపై అత్యాచారం కథ సృష్టించారని పిటిషన్‌లో ఆరోపించాడు.

తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎంజీ సేవ్లికర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను తోసిపుచ్చారు. నిందితుడి దుస్తువులతో పాటు బాధితురాలి దుస్తువులపై వీర్యం మరకలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. బాధితురాలి జననాంగంలో అంగ ప్రవేశం చేసేందుకు యత్నించడం కూడా ఐపీసీ సెక్షన్ 375, 376 కింద అత్యాచారం కిందకే వస్తుందన్నారు. కాబట్టి అంగ ప్రవేశం జరగనంత మాత్రాన అత్యాచారం జరగలేదని చెప్పేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఈ కేసు ఇంకా ట్రయల్స్ జరుతున్నందున తుది తీర్పు వెలుబడలేదు.

Advertisement

Next Story

Most Viewed