ఆ విమానాలను రానివ్వం..

by  |
ఆ విమానాలను రానివ్వం..
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌పై యూరప్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ విమాన సర్వీసులపై నిషేధం విధించినట్లు.. ఈ నిషేధం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని తేల్చి చెప్పింది. జులై 1 నుంచే నిషేధం అమలులోకి వచ్చిందని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. పీఐఏ విమానాల్లోని పైలట్ల లైసెన్స్‌లపై అనేక సందేహాలు రావడంతో.. పలు పైలట్ల లైసెన్స్‌లను పాక్ ఇటీవల రద్దు చేసింది. మే నెలలో పీఐఏకు చెందిన విమానం కూలిపోవడానికి.. పైలట్ల నిర్లక్ష్యమే కారణం అని విచారణలో తేలింది. ఏకంగా చక్రాలు దించకుండానే ల్యాండింగ్ చేయబోయారని తెలిసింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న యూరోపియన్ యూనియన్ పీఐఏపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలంలో విమానయాన రంగం కరోనా వైరస్‌ కారణంగా కుదేలైంది. ఇటువంటి సమయంలో యూరప్ నిర్ణయంతో పాక్‌ గట్టి దెబ్బే తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed