ఆ విద్యార్థులను ప్రమోట్ చేయండి : ఈటల

దిశ, వెబ్‌డెస్క్ :

తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌‌తో ఫోన్‌లో సంభాషించారు. తక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించలేకపోయిన మెడికల్‌ పీజీ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని కేంద్ర మంత్రికి ఈటల విన్నవించారు. కరోనా విధుల్లో సేవలందించిన వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చి ఉత్తీర్ణత పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

1,040 మంది వైద్య విద్యార్థులు మెడికల్‌ పీజీ పరీక్షలకు హాజరు కాగా, 100మంది వరకూ ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే, వారిని ప్రమోట్‌ చేయాలని మంత్రి ఈటల కోరారు. కాగా, దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Advertisement