సర్కారు వ్యూహానికి చెక్.. రంగు మార్చిన ఈటల రాజేందర్

by Sridhar Babu |   ( Updated:2021-08-27 12:12:12.0  )
Etela-Rajender,-change-the-
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగు మార్చారు. అనూహ్యంగా ఆయన రంగు మార్చడమేంటి? మళ్లీ పార్టీ మారాడా అనుకుంటున్నారా ఆగండాగండి.. ఆయన రంగు మార్చింది భుజాన ఉన్న కండువా కలర్ కాదు. ప్రచార రథాల రంగు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బీజేపీలో చేరిన తరువాత ఈటల ప్రచార రథాలను తయారు చేయించి నియోజకవర్గం అంతా తిప్పిస్తున్నారు. కాషాయ రంగులో తయారు చేయించిన ఈ ప్రచార రథాల్లో కొన్ని సడన్‌గా రంగు మారిపోవడంతో హుజూరాబాద్‌లో చర్చ మొదలైంది. ఇందుకు కారణమేంటని ఆరా తీస్తే అంతరార్థం వేరే ఉందని తేలింది.

Etela-Rajender,-change-the-

సర్కార్ వ్యూహానిక్ చెక్..

రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ స్కీం ప్రవేశ పెట్టి హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడి దళితులను ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దళిత ఓటర్లు దూరం అవుతారేమోనని భావించి ప్రచార రథాల రంగులను మార్చేశారట. నీలి రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ ఫొటోలు కూడా ముద్రించారు. దళిత కాలనీల్లో తిరిగే ప్రచార రథాలకు ఈ విధంగా కలర్ మార్చినట్టు తెలుస్తోంది. అదికార టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న ఈటల ప్రచార రథాల రంగు మార్చి దళిత ఓటర్ల మనసుల్లో నిలిచిపోయే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు స్థానికులు. అంతేకాకుండా.. రథాలపై బీజేపీ నాయకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది. ‘దళితబంధు’ ప్రభావానికి చెక్ పెట్టే విధంగా ఈటల క్యాంపెయిన్ వెహికిల్స్ కలర్, ఫోటోలు మార్చి దళితుల ఓట్లు చీల్చుకుంటారో ముందు ముందు చూడాలి మరి.

Advertisement

Next Story