- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్, కర్ఫ్యూపై ఈటల రాజేందర్ కీలక ప్రకటన..
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున్న రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం 50 శాతం బెడ్లు కోరిందని తెలిపారు. సాధారణ బెడ్లతో పాటు, ఐసీయూ, వెంటిలేటర్లు బెడ్లు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని ప్రజలను హెచ్చరించారు. ఫంక్షన్‌లు, బహిరంగ సభలు, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని హితవు పలికారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.