- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్ భూమి మీద ఎప్పుడు నడుస్తాడో చెప్పిన ఈటల..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీమంత్రి ఈటల రాజేందర్ పదునైన మాటలు వదులుతున్నారు. సోమవారం హుజురాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను గెలిస్తేనే కేసీఆర్ భూమి మీద నడుస్తాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. తన విజయం తర్వాత మంత్రులు, నాయకులకు గౌరవం పెరుగుతుందన్నారు. కేసీఆర్ నిరంకుశత్వాన్ని బొందబెట్టడానికి రాష్ట్రమంతా ఎదురుచూస్తుందన్నారు. వందల మంది పోలీసులను మఫ్టీలో దింపడంపై మండిపడ్డారు. కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు. సీఎం కుట్రలు రోజురోజుకూ శృతి మించుతున్నాయన్నారు.
దిక్కు మొక్కు లేని జనం అనుకోవద్దని ఒక్కక్కొరు ఒక్కో అగ్ని కణంగా మారి ఎవరికీ భయపడరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చే నాయకులు ముందు వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపెట్టాలని డిమాండ్ చేశారు. వాళ్ళందరి ప్రేమ హుజురాబాద్ ప్రజల మీద కాదని, ఓట్ల మీదనేనని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన ఈటల రాజేందర్ ఏకు కు మేకు అవుతాడనే భయంతో ఓడగొట్టలని చూస్తున్నారన్నారు.
నా ప్రజల నుంచి నన్ను దూరం చేస్తే, ఎవడికైనా ఇదే గతి పడుతుందన్న సంకేతాలు పంపాలని చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. నేను గెలిస్తే మంత్రులకు విలువ పెరుగుతుందని, ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయన్నారు. తనను ఓడించేందుకే రాష్ట్ర ఖజానా అంతా హుజురాబాద్‌లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఇజ్జత్ ఉన్నవాన్ని కాబట్టే రాజీనామా చేశానని, మీకు ఉందో లేదో టీఆర్ఎస్‌లో చేరిన వారు తేల్చుకోవాలన్నారు.