- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలపై హైపవర్ కమిటీ ఏర్పాటు
దిశ, ఏపీ బ్యూరో: టెన్త్, ఇంటర్ ఫలితాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.ఛాయారతన్ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులకు చోటు కల్పించినట్లు విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు అందించనుందని తెలిపారు. ఇక ఇంటర్మీడియేట్ ఫలితాలకు అనుసరించాల్సిన విధి విధానాలను నిర్ణయించేందుకు ఛాయారతన్ నేతృత్వంలోనే మరో హైపవర్ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.