- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
దిశ, హైదరాబాద్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వలస కార్మికులకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆహారం, ఇతర నిత్యావసరాలను సోమవారం పంపిణీ చేశారు. దాతలు ముందుకొచ్చి నిరుపేదలకు సహాయం చేయడాన్ని ఆయన అభినందించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో హైదరాబాద్ శాంతినగర్ వాకర్స్ క్లబ్, అభయం సొసైటీ ఆధ్వర్యంలో కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు.
కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయన్నారు. లాక్ డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలనీ, సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం) పాటించాలని కోరారు. 100 మంది వలస కార్మికులకు 5 కిలోల బియ్యం, కంది పప్పు, వంట నూనెతో పాటు ఇతర సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గోపినాథ్, ఆర్డీవో మల్లయ్య, శాంతినగర్ వాకర్స్ క్లబ్ సభ్యులు చక్రవర్తి, బాచుపల్లి తహసీల్దార్ నిర్మల పాల్గొన్నారు.
Tags: covid 19 effect, lockdown, essential commodities distribution, to migrant workers, collector, ngos