పోలీసుల భయంతో పరారై.. శవంగా తేలాడు..!

దిశ, కరీంనగర్:

మూడు రోజుల క్రితం ఓ కేసు విషయమై టాస్క్‎ఫోర్స్ పోలీసులు రావడంతో భయంతో పారిపోయిన ఓ యువకుడు.. వ్యవసాయ బావిలో శవమై తేలాడు. తమ కొడుకు మృతికి పోలీసులే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్‎రావుపల్లిలోని వ్యవసాయ బావిలో పడి సాయి అనే యువకుడు మృతి చెందాడు. తమ కొడుకు మరణానికి టాస్క్‎ఫోర్స్ పోలీసులే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సాయిపై అక్రమ కేసులు పెట్టి నాలుగు నెలలు జైల్లో ఉంచారని మృతుడి బంధువులు ఆరోపించారు.

Advertisement