ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలి: ఎర్రబెల్లి

by Shyam |
ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలి: ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: కరోనా నుంచి ఎవరి ప్రాణాలను వారే కపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఆదివారం తన వ్యవసాయక్షేత్రంలో పంటలు, మొక్కలను పరిశీలించిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కాసేపు మాట్లాడారు. అనంతరం జరుగుతున్న పనులపై ఆరా తీసి చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న వారికి మాస్కులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు. ఇష్టానుసారం బయట తిరగకుండా, సమయాన్ని సొంత పనులు, వ్యవసాయానికి కేటాయించాలన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు నియంత్రిత పంటలను సాగు చేసి బాగుపడాలన్నారు. చేను, చెలకలు ఆహ్లాదాన్ని కలిగించి, ఆయువు పెంచుతాయన్నారు.

Advertisement

Next Story