- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్.. రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మేయర్ స్వర్ణ దంపతులు
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజేశ్వర్ రావు దంపతులు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఆదివారం ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి రాజేశ్వర్‌రావు, స్వర్ణ దంపతులు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని రాజేశ్వర్ రావు దంపతులు చాలా కాలంగా మనస్తాపంతో ఉన్నారు.
నాలుగేళ్లుగా అనేక అవమానాలను భరిస్తూ కూడా కేవలం పార్టీపై ఉన్న మమకారంతో కొనసాగుతున్నామని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే తమ సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లుగా తెలిసింది. అయితే, గ్రేటర్ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్న స్వర్ణ దంపతులు పార్టీకి రాజీనామా కూడా చేశారు. అయితే, పార్టీ అధిష్టానం మాత్రం వీరి రాజీనామాను ఆమోదించలేదు. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు కూడా వీరు రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పు, స్వయంగా రేవంత్‌రెడ్డి నుంచి పిలుపు రావడంతో ఆదివారం పీసీసీ చీఫ్‌ను స్వర్ణ, రాజేశ్వర్ రావులు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, పార్టీ మీ సేవలను గుర్తిస్తుందని చెప్పినట్లుగా స్వర్ణ దంపతులు ‘దిశ’కు వివరించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, జిల్లాలో పార్టీ అద్భుతంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.