వైఎస్సార్ టీపీ ‘దళిత విభాగం కమిటీ’ రాష్ట్ర కన్వీనర్‌గా ఏపూరి సోమన్న

by Shyam |
Epoori Somanna
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం రాష్ట్ర కమిటీని బుధవారం ప్రకటించారు. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ఈ కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కన్వీనర్‌గా ఏపూరి సోమన్నను ఎన్నుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యతలు సైతం ఆయనకే అప్పగించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్‌గా వెల్తూరు మల్లయ్య, మెదక్ జిల్లా కో కన్వీనర్‌గా బిట్ల వెంకటేశ్, కో ఆర్డినేటర్‌గా శ్రీనివాస్ రావు, ఖమ్మం జిల్లా కో కన్వీనర్‌గా రాములమ్మ, మహబూబ్ నగర్‌కు రాంచందర్, రంగారెడ్డి జిల్లాకు పాకాల డేనియల్, రాజేశ్, ఆదిలాబాద్‌కు దుర్గం నగేశ్, నిజామాబాద్‌కు మదన్, హైదరాబాద్‌కు జేరిపోతుల వినోద్‌ను నియమించారు. మరో 58 మందిని కమిటీ మెంబర్లుగా ప్రకటించారు.

Advertisement
Next Story

Most Viewed