పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త!

by  |
పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త!
X

దిశ, సెంట్రల్ డెస్క్: పింఛనుదారులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ(ఈపీఎఫ్‌వో) శుభవార్త తెలిపింది. ఇకమీదట రిటైర్డ్ ఉద్యోగులు లైఫ్‌ సర్టిఫికెట్‌(జీవన్‌ ప్రమాణ్‌)ను అందజేయడంలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ఈపీఎఫ్‌వో మరో వెసులుబాటు ఇస్తోంది. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చని, కోవిడ్‌ వైరస్ నేపథ్యంలో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్(ఈపీఎస్‌) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పింఛనుదారులు ప్రతి సంవత్సరం నవంబర్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ను అందజేయాలి. దీంతో పింఛను అందకపోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందులో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లలో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు ఉంటుందని కార్మిక శాఖ తెలిపింది. వీటితో పాటు దేశంలో ఉన్న మొత్తం 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాల్లో కూడా వీటిని సమర్పించవచ్చని పేర్కొంది. పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల్లో ఇవ్వొచ్చని, ఇచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.


Next Story