- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎఫ్ వడ్డీరేటు తగ్గే అవకాశం!
దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉంది. మార్కెట్ అస్థిరత, ఆదాయం భారీగా క్షీణించిన కారణంగా సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 8.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లను 8.1 శాతానికి కోత పెట్టే అవకాశాలున్నాయి. రేట్లు తగ్గితే 6 కోట్ల ఈఫీఎఫ్ ఖాతాదార్లపై ప్రభావం పడుతుంది. ఈపీఎఫ్ఓకు చెందిన ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఆడిట్ కమిటీ వడ్డీ చెల్లింపు సామర్థ్యంపై అంచనా వేసేందుకు త్వరలో భేటీ అవనుంది. మార్చి మొదటి వారంలో 8.5 శాతం వడ్డీ రేటును ప్రకటించినప్పటికీ దానికి ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం లభించలేదు. నగదు ప్రవాహం భారీగా తగ్గిన నేపథ్యంలో గత సంవత్సం ఆధారంగా ప్రకటించిన వడ్డీ రేటు చెల్లింపులు కష్టంగా మారుతుంది. మందగమనం, ఆ తర్వాత కరోనా కారణంగా నగదు ప్రవాహం తగ్గింది. మరోవైపు, ఏప్రిల్, మే నెలల్లో రూ.11,540 కోట్ల 3 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు, ఇందులో రూ.4,580 కోట్ల విలువైన 15.5 లక్షల క్లెయిమ్‌లు ఇటీవల కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రకటించిన అడ్వాన్స్‌కు సంబంధించినవని జూన్ నెల ప్రారంభంలో పేర్కొంది.