- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మంగళవారంతో ముగియనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈనెల 30 నుంచి బయోసెక్యూర్ వాతావరణంలో సౌతాంప్టన్ వేదికగా వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే 30న, రెండో వన్డే ఆగస్టు 1న, మూడో వన్డే ఆగస్టు 4న జరగనుంది. ఈ సిరీస్ కోసం 14 మందితోపాటు ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఈసీబీ ప్రకటించింది. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్, వైస్ కెప్టెన్‌గా మొయిన్ అలీ వ్యవహరించనున్నారు. టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్, కీపర్ జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ నుంచే 2023 వరల్డ్ కప్ అర్హత కోసం ఐసీసీ ప్రవేశపెట్టిన ‘సూపర్ లీగ్’ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, రద్దు, టై అయినా చెరో ఐదు పాయింట్లు దక్కుతాయి.
ఇంగ్లండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ (వైస్ కెప్టెన్), జానీ బారిస్ట్రో, టామ్ బాన్‌టన్, సామ్ బిల్లింగ్స్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, జో డెన్లీ, షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, రీస్ టాప్లే, జేమ్స్ విన్స్, డేవిడ్ విల్లీ. రిజర్వ్ ఆటగాళ్లు : రిచర్డ్ గ్లీసన్, లూయీస్ గ్రెగొరీ, లియామ్ లివింగ్‌స్టన్