పట్టాలు ఉన్నాయి.. పని లేదు

by Shamantha N |
పట్టాలు ఉన్నాయి.. పని లేదు
X

చెన్నై : ఇంజనీరింగ్, ఎంబీఏలు చేశారు. కానీ, పదోతరగతి అర్హతగల పనులు చేస్తున్నారు. డిగ్రీ పట్టాలున్నా.. పార్కింగ్‌లో పనిచేస్తున్నారు. తమిళనాడులో నిరుద్యోగ దుస్థితి ఇది. వివరాల్లోకి వెళితే.. స్మార్ట్ కార్ పార్కింగ్ కోసం చెన్నై కార్పొరేషన్ ఒక యాప్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని వాహనదారులకు వివరించేందుకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఓ ప్రైవేటు కంపెనీ.. 50 పార్కింగ్ అటెండెంట్ ఉద్యోగాల కోసం పదో తరగతి అర్హతతో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. కేవలం 50 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించిన వేయికిపైగా వచ్చి చేరాయి. ఇందులో సెలెక్ట్ అయినవారందరూ ఇంజనీరింగ్, ఎంబీఏ పట్టాదారులే కావడం గమనార్హం. ఎంబీఏ, ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ పూర్తి చేసి కాలేజీ నుంచి బయటికొచ్చాక ఉద్యోగాలు దొరకడం లేదని టీమ్ లీడర్ రాజేశ్ అన్నారు. అంతెందుకు పదివేల లోపు జీతంతోనూ పనిచేసుందుకు కొందరు ముందుకువస్తున్నారని తెలిపారు.

గతేడాది తమిళనాడు అసెంబ్లీలో స్వీపర్‌గా 14 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 4,600 మంది ఇంజనీర్లు, ఎంబీఏ, రీసెర్చ్ స్కాలర్లు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయినప్పటికీ రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని మాత్రం ప్రభుత్వం తోసిపుచ్చుతున్నది.

Tags: tamilnadu, unemployment, engineering, MBA, no jobs

Advertisement

Next Story

Most Viewed